Anantha Sriram’s Family: భూ వివాదంలో అనంత శ్రీరామ్ ఫ్యామిలీ.. రక్షణ కావాలంటూ కలెక్టర్‌కు వినతి

రక్షణ కావాలంటూ కలెక్టర్‌కు వినతి

Update: 2026-05-25 12:05 GMT

Anantha Sriram’s Family: టాలీవుడ్ ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో ప్రత్యక్షమవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన తండ్రితో కలిసి కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన.. తమ కుటుంబానికి చెందిన స్థలం విషయంలో జరుగుతున్న అన్యాయంపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

యలమంచిలి మండలం దొడ్డిపట్లలో ఉన్న తమ ఉమ్మడి స్థలాన్ని, తమ అనుమతి లేకుండానే వేరొకరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ అనంత శ్రీరామ్ తన వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ స్థలం కోర్టు వివాదంలో ఉందని.. అయినప్పటికీ కొందరు వ్యక్తులు చట్టాన్ని అతిక్రమించి ఆ స్థలంలోకి అక్రమంగా చొరబడ్డారని ఆరోపించారు. అంతేకాదు.. లారీలతో అక్కడ మెటీరియల్ కూడా దించేశారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ భూ వివాదం కారణంగా వృద్ధులైన తన తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని అనంత శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా.. తమ కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే, తన వృద్ధుడైన తండ్రి తరఫున మాట్లాడుతూ.. తమ ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా తగిన రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన అనంత శ్రీరామ్ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి ఎదురవడంపై అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News