Anantika: ఈ అమ్మాయి టాలెంట్ చూసి నోరెళ్లబెట్టారు
టాలెంట్ చూసి నోరెళ్లబెట్టారు;
Anantika: మ్యాడ్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకు న్నహీరోయిన్ అనంతిక సనిల్ కుమార్. కేరళకి చెందిన ఈ టీనేజీ అమ్మాయి ఆసినిమాలో క్యూట్ గా కనిపిస్తూ చక్కటి నటనతో ఆకట్టుకుంది. అందులో ఆమెను చూసి యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి '8 వసంతాలు' సినిమాలో అవకా శమిచ్చాడు. డ్రామా అండ్ రొమాంటిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో అనంతిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్' ఈ చిత్రాన్ని నిర్మించింది. హీరోయిన్ ఓరి యెంటెడ్ గా వస్తున్న ఈ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక మూవీ ప్రమోషన్స్లో భాగంగా '8 వసంతాలు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనంతిక మల్టీ టాలెంట్ చూసి అందరూ ఫిదా అయ్యారు. ఈ అమ్మాయిలో ఇన్ని కళలున్నాయా అంటూ నోరెళ్లబెట్టి చూశారు. నటిగానే కాకుండానే క్లాసికల్ డ్యాన్స్ తో పాటు సాగర సంగమంలోని ఓ పాటకు ఆమె అద్భుతంగా అభినయించింది. దీనికి తో డు అనంతిక మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం మరో ఎత్తు. స్టేజ్ మీద తన ప్రతిభ మరింత ఎలివేట్ అయింది. కేవలం 19 ఏండ్ల వయసులోనే ఇంత పరిణితిని కనబరుస్తోన్న అనంతికపై టాలీవుడ్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి.