Andhra King Movie: ఒక్కరోజు ముందుగానే ఆంధ్ర కింగ్
ఆంధ్ర కింగ్
Andhra King Movie: రామ్ పోతినేని హీరోగా వస్తున్న సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకానిమా విడుదల తేదీని ఒక రోజు ముందుకు మార్చారు. ముందుగా నవంబర్ 28న విడుదల చేయాలని నిర్ణయించారు .ప్రేక్షకులకు నాలుగు రోజుల సుదీర్ఘ వీకెండ్‌ను అందించడం ద్వారా (గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం) సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేలా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
నవంబర్ 18న కర్నూలులోని ఔట్ డోర్ స్టేడియంలో ట్రైలర్ విడుదల ఈవెంట్‌తో పాటు ఒక ప్రత్యేకమైన డ్రోన్ షోను కూడా నిర్వహించనున్నారు. ఈ సినిమా రామ్ కెరీర్‌కు ఎంతో కీలకంగా మారింది.ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 27న రామ్ అభిమానులకు పండుగ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (ప్రధాన పాత్రలో), భాగ్యశ్రీ బోర్సే (హీరోయిన్). కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో (ఒక స్టార్ హీరోగా) కనిపించనున్నారు.దర్శకుడు మహేశ్ బాబు .పి డైరెక్షన్ వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వివేక్-మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ఒక స్టార్ హీరోను పిచ్చిగా అభిమానించే ఒక ఫ్యాన్ బయోపిక్ గా రూపొందించబడింది.