Andhra Pradesh Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత..తొలి భారత సెలబ్రిటీగా రికార్డ్
తొలి భారత సెలబ్రిటీగా రికార్డ్
Andhra Pradesh Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. మార్షల్ ఆర్ట్స్‌లో అసాధారణమైన ప్రతిభను కలిగి పవన్ జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో ఒక అత్యంత అరుదైన, చారిత్రాత్మకమైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు.పవన్ కళ్యాణ్ పురాతన జపనీస్ కత్తిసాము కళ అయిన 'కెంజుట్సు' లో అధికారికంగా ప్రవేశం (Induction) పొందారు. ప్రతిష్ఠాత్మక జపనీస్ సంస్థ సోగో బుడో కన్రి కై నుంచి ఆయనకు 'ఫిఫ్త్ డాన్' (5th Dan) గౌరవం లభించింది. ఈ గౌరవం పొందిన తొలి భారతీయ సెలబ్రిటీ ఆయనే. జపాన్ వెలుపల ఈ వంశపు శిక్షణ,గుర్తింపు పొందిన అతికొద్ది మందిలో పవన్ ఒకరిగా నిలిచారు.ఆయన మూడు దశాబ్దాలకు పైగా యుద్ధ కళల పట్ల చూపిన అంకితభావానికి గాను, గోల్డెన్ డ్రాగన్స్' సంస్థ ఆయనను "టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్" అనే బిరుదుతో సత్కరించింది.
పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందే కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. 1997లో ఒక బహిరంగ ప్రదర్శన తర్వాతే ఆయనకు 'పవన్' అనే పేరు స్థిరపడింది.: ఆయన హన్షీ ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ మహమూద్ సిద్ధిక్ మహమూదీ పర్యవేక్షణలో కెంజుట్సు, కండో (Kendo) లో అధునాతన శిక్షణ పొందారు. తన సినిమాలైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, ఖుషి, జానీ , OG చిత్రాల్లో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ స్టైల్స్‌ను ఆయన స్వయంగా ప్రదర్శించారు.
రాజకీయాల్లో, సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, ఆయన క్రమశిక్షణతో కూడిన సాధనను (Practice) వదలకపోవడమే ఈ అంతర్జాతీయ గుర్తింపునకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఈ స్థాయి గౌరవం పొందడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.