Trending News

Jananayakudu Movie: విజయ్ జననాయకుడు సినిమాకు మరో షాక్

జననాయకుడు సినిమాకు మరో షాక్

Update: 2026-01-27 08:42 GMT

Jananayakudu Movie: హీరో విజయ్‌ నటించిన జననాయకుడు సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్‌ ఇవ్వాలన్న సింగిల్‌ బెంచ్ తీర్పును మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ రద్దు చేసింది.అంతకుముందు మద్రాస్ హైకోర్టుకు చెందిన సింగిల్ బెంచ్, ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేయగా సింగిల్ బెంచ్ మేకర్స్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.ఈ తీర్పును సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డ్ అప్పీల్ చేయగా మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కె.ఆర్. శ్రీరామ్ , జస్టిస్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

సెన్సార్ బోర్డ్ స్వతంత్రతను , వారి నిబంధనలను గౌరవించాలని, కోర్టులు నేరుగా సర్టిఫికేషన్ విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదని పేర్కొంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.

ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ సెన్సార్ బోర్డ్ నిబంధనల ప్రకారం రీ-సెన్సార్ లేదా బోర్డ్ సూచించిన కట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని (TVK పార్టీ) ప్రకటించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో, 'జననాయకుడు' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రాజకీయ విమర్శలు లేదా సమకాలీన అంశాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే సెన్సార్ వివాదం తలెత్తిందని టాక్.ఈ తీర్పుతో సినిమా విడుదల తేదీపై కొంత అనిశ్చితి నెలకొంది. మేకర్స్ ఇప్పుడు సెన్సార్ బోర్డ్ సూచించిన మార్పులకు ఒప్పుకుంటారా లేక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అన్నది చూడాలి.

Tags:    

Similar News