Veteran Actress Saroja Devi: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..ప్రముఖ నటి సరోజాదేవి కన్నుమూత
ప్రముఖ నటి సరోజాదేవి కన్నుమూత;
Veteran Actress Saroja Devi: సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్నుమూసిన మరునాడే అలనాటి ప్రముఖ నటి బి. సరోజాదేవి (87) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బెంగళూరులోని తన నివాసంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.
బి. సరోజాదేవి తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో 200లకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆమె 1955లో మహాకవి కాళిదాస అనే కన్నడ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి అగ్ర కథానాయకులతో కలిసి నటించారు. జగదేకవీరుని కథ, సీతారామ కళ్యాణం వంటి కొన్ని తెలుగు సినిమాలు ఉన్నాయి.
ఆమె సినీ రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ (1969), పద్మభూషణ్ (1992) వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. అభినయ సరస్వతి వంటి బిరుదులతో ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమె మృతి పట్ల సినీ,రాజకీయ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.