Actress Shilpa Shirodkar: 30 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న మహేశ్ బాబు మరదలు

మహేశ్ బాబు మరదలు;

Update: 2025-08-29 05:55 GMT

Actress Shilpa Shirodkar: సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు, ఒకప్పటి ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్( మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ చెల్లెలు) సినిమాల్లోకి తిరిగి వస్తున్నారు. చాలా సంవత్సరాల విరామం తర్వాత ఆమె తెలుగు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

శిల్పా శిరోద్కర్ చాలా కాలం సినిమాలకు దూరంగా ఉండి, ఇటీవలే హిందీ బిగ్ బాస్ సీజన్ 18లో పాల్గొని మళ్ళీ వెలుగులోకి వచ్చారు. ఈ పాత్ర నచ్చడంతో ఆమె సినిమాకు అంగీకరించినట్లు తెలిపారు.ఇది శిల్పా శిరోద్కర్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తెలుగులో నటిస్తున్న రెండో చిత్రం. ఆమె గతంలో మోహన్ బాబు నటించిన 'బ్రహ్మ' (1992) సినిమాలో నటించారు.

సుధీర్ బాబు హీరోగా వస్తోన్న జటాధర సినిమాలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాలో శిరోద్కర్ 'శోభ' అనే కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో ఆమె నల్ల చీరలో తాంత్రిక శక్తితో కూడిన పాత్రలో కనిపిస్తున్నారు. 'జటాధర' ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనర్ అని తెలుస్తోంది.

Tags:    

Similar News