Anushka: ఆరో తరగతి లోనే లవ్ కు ఓకే చెప్పిన అనుష్క

లవ్ కు ఓకే చెప్పిన అనుష్క;

Update: 2025-07-12 05:21 GMT

Anushka:  అరుంధతి, వేదం, భాగమతి వంటి మూవీలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి అనుష్క శెట్టి. స్ట్రాంగ్ ఫిమేల్ రోల్స్తో సత్తా చాటిన ఈ భామ క్రేజ్ బాహుబలి తర్వాత మరింత విస్తరించింది. కంటెంట్ కు ప్రాధాన్యతనిచ్చే కథలను మాత్రమే ఎంచుకొని సత్తా చాటింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఘాటీ మూవీ కూడా వైవిధ్య భరితమైన కథతో రూపొందినట్లు సమాచారం. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె చాలా అరుదుగా స్పందిస్తుంటుంది. కానీ ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పిందీ భామ. తాను ఆరో తరగతి చదువుతున్నప్పుడు తమ క్లాస్ లో ఓ అబ్బాయి ఈ భామకు ఐలవ్యూ చెప్పాడట. ఆ సమయంలో ఆ మాటలకు అర్థం తెలియదట ఈ అమ్మడికి. కానీ ఏదో కొత్త ఫీలింగ్ కలిగిందట. దీంతో ఓకే అని చెప్పిందట అనుష్క. అది చాలా చిన్న విషయమే కావచ్చు. కానీ, ఇప్పటి కీ తాను ఆ విషయా న్ని మరిచిపోలేదని చెప్పింది. అదో మధుర జ్ఞాపకంగా మిలిగిపోయిందని తెలిపింది. ప్రస్తుతం విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అనుష్క వ్యక్తిగత జీవితం గురించి అనేక పుకార్లు వచ్చాయి, ముఖ్యంగా ప్రభాస్‌తో ఆమె ప్రేమలో ఉందని, పెళ్లి చేసుకోబోతున్నారని చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, అనుష్క, ప్రభాస్ ఇద్దరూ పలు సందర్భాల్లో తాము మంచి స్నేహితులం మాత్రమే అని, తమ మధ్య ఎలాంటి ప్రేమ బంధం లేదని స్పష్టం చేశారు. వారిద్దరూ కలిసి "బాహుబలి" వంటి విజయవంతమైన చిత్రాలలో నటించడం వల్ల ఈ పుకార్లు వచ్చాయి. పెళ్లి అనేది తన వ్యక్తిగత విషయమని, సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేస్తానని ఆమె పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి, ఆమె తన తదుపరి చిత్రం ఘాటి విడుదల కోసం సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News