Arbaaz Khan: 58 ఏళ్ల వయసులో రెండోసారి తండ్రైన అర్బాజ్ ఖాన్
రెండోసారి తండ్రైన అర్బాజ్ ఖాన్
Arbaaz Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు , నిర్మాత అర్బాజ్ ఖాన్ రెండోసారి తండ్రయ్యారు. అర్బాజ్ ఖాన్ రెండవ భార్య మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ (Sshura Khan) ఆడబిడ్డకు జన్మించింది. అక్టోబర్ 5 ఆదివారం నాడు అధికారికంగా వెల్లడైంది.అర్బాజ్ ఖాన్‌కు ఇది రెండవ సంతానం. ఆయనకు మొదటి భార్య మలైకా అరోరాతో అర్హాన్ ఖాన్ అనే 22 ఏళ్ల కుమారుడు (Son) ఉన్నారు.
అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత, 2023లో ఆయన మేకప్ ఆర్టిస్ట్ అయిన షురా ఖాన్‌ను వివాహం చేసుకున్నారు.ప్రస్తుత 58 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కావడం పట్ల ఖాన్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. వారికి సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అర్బాజ్ ఖాన్ తన సోదరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి 'దబాంగ్' (Dabangg) ఫ్రాంచైజీకి నిర్మాతగా వ్యవహరించారు.దబాంగ్ , దబాంగ్ 3 కి నిర్మాతగా వ్యవహరించగా.. దబాంగ్ 2 కి దర్శకత్వం కూడా వహించారు.తెలుగులో ఆయన చిరంజీవి నటించిన 'జై చిరంజీవ, రాజ్ తరుణ్ నటించిన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రంలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు అయ్యారు.