Kajal Expresses Anguish: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి.. కాజల్ ఆవేదన

కాజల్ ఆవేదన

Update: 2025-12-22 05:29 GMT

Kajal Expresses Anguish: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల నటి కాజల్ అగర్వాల్ స్పందించారు. ఆమె తన సోషల్ మీడియా వేదికగాఅక్కడి హిందువుల రక్షణ కోసం గళమెత్తారు. బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లు, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, అమాయక ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీల రక్షణ కోసం అంతర్జాతీయ సమాజం స్పందించాలని ఆమె కోరారు.హిందువులారా మేల్కోండి..ఈ కష్టకాలంలో హిందువులందరూ ఐక్యంగా ఉండాలని, బాధితులకు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు.

బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ మార్పుల తర్వాత హిందూ సమాజంపై దాడులు పెరిగాయనే వార్తలు వచ్చాయి. దీనిపై కేవలం కాజల్ అగర్వాల్ మాత్రమే కాకుండా, పలువురు సినీ ప్రముఖులు కంగనా రనౌత్, సోను సూద్ వంటి వారు కూడా స్పందించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి సామాజిక, మతపరమైన అంశాలపై నేరుగా స్పందించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. చాలా మంది నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ మద్దతు తెలుపుతున్నారు.

Tags:    

Similar News