Baahubali Re-Release: రెండు పార్ట్ లు ఒకేసారి..బాహుబలి రీ రిలీజ్

బాహుబలి రీ రిలీజ్;

Update: 2025-07-10 08:18 GMT

Baahubali Re-Release: తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన బాహుబలి గురించి ఎంత చెప్పినా తక్కువే..ప్రభాస్ హీరోగా..రానా విలన్ గా నటించిన ఈ మూవీ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా రెండు పార్ట్ లుగా వచ్చిఓ మైలురాయిగా నిలిచింది. బాహుబలి 1 రూ.600 కోట్ల గ్రాస్, బాహుబలి 2 దాదాపు 1800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ హయ్యెస్ట్ కలెక్షన్లలో టాప్ 3లో నిలిచింది. ఈసినిమాతో ప్రభాస్ జీవితమే మారిపోయిందని చెప్పుకోవచ్చు. అలాంటి సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు.

బాహుబలి 1&2’ సినిమాలను ఒకేసారి రీరిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో రీరిలీజ్ అయ్యే ఈ చిత్ర తేదీని ప్రత్యేక పోస్టర్‌ ద్వారా ఇవాళ ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘బాహుబలి’ రిలీజై ఇవాళ్టికి10 ఏళ్లు పూర్తికానుంది. ఈ క్రమంలో ‘బాహుబలి వస్తున్నాడు’ అని మేకర్స్ ట్వీట్ చేయడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. 

Tags:    

Similar News