Balakrishna: కాశీలో బాలయ్య.. విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు

విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు

Update: 2025-12-19 14:01 GMT

Balakrishna: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన అఖండ 2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని, చిత్ర బృందం ఆధ్యాత్మిక నగరమైన వారణాసిని సందర్శించింది. సినిమా ఘనవిజయం సాధించిన సంతోషంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను వారణాసిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని, గంగా హారతిలో పాల్గొన్నారు.

ఈ పర్యటనలో బాలయ్య, బోయపాటి ఇద్దరూ పట్టు వస్త్రాలు ధరించి పూర్తి ఆధ్యాత్మిక రూపంలో కనిపించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. జై బాలయ్య నినాదాలతో నెటిజన్లు ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు.

డిసెంబర్ 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని వసూళ్ల వర్షం కురిపిస్తోంది. హిందుత్వం, ఆధ్యాత్మిక అంశాల కలయికతో బోయపాటి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. బాలకృష్ణ నటనకు తోడుగా శక్తివంతమైన విలన్ పాత్రలో ఆది పినిశెట్టి తమ నటనతో ఆకట్టుకున్నారు.

Tags:    

Similar News