Akhanda 2: అఖండ 2లో బాలయ్య విశ్వరూపం చూస్తారు

బాలయ్య విశ్వరూపం చూస్తారు

Update: 2025-11-25 06:13 GMT

Akhanda 2: అఖండ 2: తాండవం' లోని యాక్షన్ సీక్వెన్స్‌లు మొదటి భాగాన్ని మించిపోయేలా ఉత్కంఠభరితంగా ఉంటాయని ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ చెప్పారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ 'విశ్వరూపం' చూస్తారని, ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌కు గూస్‌బంప్స్ రావడం ఖాయమని వారు తెలిపారు.బాలకృష్ణ ఇందులో శివుడి అనుగ్రహం ఉన్న పాత్రలో కనిపిస్తారు. సహజంగా ఉండే గన్‌ శక్తికి త్రిశూలం శక్తి తోడై, దానికి శివశక్తి జతకడితే ఎంతటి దైవిక శక్తి ఉత్పన్నమవుతుందో, దానికి తగ్గట్టుగానే యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసినట్లు వివరించారు.

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించే ఉద్దేశంతో ప్రతిదీ చాలా గ్రాండ్‌గా తీర్చిదిద్దారని, 'అఖండ'కు మించిన స్పాన్ ఈ సినిమాలో ఉందని చెప్పారు.బాలకృష్ణ పాత్ర మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తుంది, ఆ మూడు పాత్రలకూ వేర్వేరు యాక్షన్ స్టైల్స్ రూపొందించాల్సి వచ్చిందని, యాక్షన్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుందని తెలిపారు.

కొందరు విమర్శించిన గన్, త్రిశూలం వాడిన యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడుతూ, దీని వెనుక లాజిక్ ఉందని, ఇది శివ అనుగ్రహం ఉన్న పాత్ర కాబట్టి దైవిక శక్తిని దృష్టిలో ఉంచుకొని యాక్షన్ డిజైన్ చేసినట్లు స్పష్టం చేశారు. అఖండ'లో రథచక్రం తిప్పే సీన్‌కు మంచి స్పందన వచ్చినట్లే, 'అఖండ 2' లో కూడా అంతకుమించి హైలైట్ అయ్యే సిగ్నేచర్ యాక్షన్ సీన్ ఉందని ధృవీకరించారు.ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags:    

Similar News