Betting App Case: బెట్టింగ్ యాప్ కేసు: ఈడీ విచారణకు రానా

ఈడీ విచారణకు రానా;

Update: 2025-08-11 08:58 GMT

Betting App Case: బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో నటుడు దగ్గుబాటి రానా ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌లోని ఈడీ ఆఫీసుకు రానున్నారు. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లను ప్రచారం చేశారన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ యాప్‌లు అక్రమ లావాదేవీల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాయని ఈడీ అనుమానిస్తోంది. ఈ కేసులో ఈడీ పలువురు నటీనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు నోటీసులు జారీ చేసింది. రానా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి వంటి పలువురు ఈ విచారణకు హాజరయ్యారు.

రానా గతంలో జంగ్లీ రమ్మీ వంటి కొన్ని గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రమోషన్ల ద్వారా వచ్చిన ఆర్థిక లావాదేవీలు, వాటి చట్టబద్ధతపై ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.

రానా ఇంతకుముందు జూలై 23న విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, షూటింగ్ షెడ్యూల్ కారణంగా సమయం కోరారు. దాంతో, ఈడీ ఆయనకు ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. రానా తరపు న్యాయవాదులు, పీఆర్ టీమ్ ఆయన చట్టబద్ధమైన యాప్‌లను మాత్రమే ప్రమోట్ చేశారని, ఆ ఒప్పందాలు 2017లోనే ముగిశాయని వివరణ ఇచ్చారు. ఈడీ అధికారులు రానా ఇచ్చిన వాంగ్మూలాన్ని నమోదు చేసి, ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు.

లోన్ యాప్స్‌‌‌‌ ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్‌‌‌‌ మీడియా ఇన్‌‌‌‌ఫ్లూయెన్సర్లు, సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్‌‌‌‌లో చేర్చింది. ఈ నెల 13న మంచు లక్ష్మి ఈడీ విచారణకు హాజరుకానున్నారు.

Tags:    

Similar News