Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ కేసు: ఈడీ విచారణకు ప్రకాశ్ రాజ్
ఈడీ విచారణకు ప్రకాశ్ రాజ్;
Betting Apps Case: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయంలో అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ యాప్‌లతో ప్రమోషన్ల కోసం ఎంత డబ్బు తీసుకున్నారు, ఆ లావాదేవీల వివరాలు వంటి విషయాలపై ప్రకాశ్ రాజ్ ను ఈడీ ప్రశ్నించనుంది.
ఈ కేసులో ప్రకాష్ రాజ్‌తో పాటు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి వంటి ప్రముఖ సినీ తారలకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. మొత్తం 29 మందిని ఈసీఐఆర్‌లో చేర్చారు. ఈ క్రమంలోనే విచారణకు అధికారులు షెడ్యూల్ సిద్ధం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నమోదైన FIRల ఆధారంగా ఈ మనీ లాండరింగ్ దర్యాప్తు జరుగుతోంది. ఆగస్టు 11న విజయ్ దేవర కొంద, రానా,ఆగస్టు 13న మంచులక్ష్మి ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
గతంలో, ప్రణవ్ జ్యువెలర్స్ కు సంబంధించిన రూ. 100 కోట్ల పోంజీ స్కీమ్ కేసులో కూడా ప్రకాష్ రాజ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆ కేసులో ప్రణవ్ జ్యువెలర్స్ కు ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ప్రస్తుతం, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ లోతైన దర్యాప్తు జరుపుతోంది.