Bigger Than Dhamaka: ధమాకాను మించి మాస్ జాతర.. ఈ నెల 31న రిలీజ్
ఈ నెల 31న రిలీజ్
Bigger Than Dhamaka: మాస్ మహారాజా రవితేజ, యువ సంచలనం శ్రీలీల జోడీ మళ్ళీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం మాస్ జాతర ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 2022లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ధమాకా తరువాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మాస్ ఆడియన్స్‌లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మాస్ పవర్ మళ్ళీ రిపీట్ అవుతుందా?
రవితేజకు ఉన్న తిరుగులేని మాస్ ఇమేజ్, ఆయన స్టైల్‌కి దగ్గరగా ఉండటం వల్లే ధమాకా ఆ స్థాయిలో విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు. శ్రీలీల కూడా తన డ్యాన్స్, ఎనర్జీతో మాస్ కంటెంట్ ఉన్న సినిమాలలో సందడి చేయగలనని 'ధమాకా' ద్వారా నిరూపించింది. అలాంటి ఈ ఇద్దరూ ఇప్పుడు భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ జాతర కోసం మళ్ళీ జోడీ కట్టారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. భీమ్స్ అందించిన సంగీతం కూడా సినిమాకు హైలైట్‌గా నిలిచింది.
ఇద్దరి కెరీర్‌లకు కీలకం
ధమాకా తర్వాత రవితేజ దాదాపు ఐదు సినిమాలు చేసినప్పటికీ.. ఏవీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. అదేవిధంగా, శ్రీలీల కూడా ధమాకా తర్వాత వరుస సినిమాలతో జోరు చూపించినా భగవంత్ కేసరి తర్వాత ఆశించిన స్థాయిలో హిట్‌ను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో మాస్ జాతర విజయం రవితేజ, శ్రీలీల ఇద్దరి కెరీర్‌లోనూ కీలకంగా నిలిచింది. పండుగ వాతావరణంలో వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లను రాబడుతుందో వేచి చూడాలి.