Bollywood Actress Shilpa Shirodkar: నాకు డబ్బంటే పిచ్చి..అలాంటిది నా క్యారెక్టర్
అలాంటిది నా క్యారెక్టర్
Bollywood Actress Shilpa Shirodkar: శిల్ప శీరోద్కర్ తన రీ-ఎంట్రీ చిత్రం 'జటాధర' (తెలుగు ,హిందీ) ప్రమోషన్లలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఆమె 'జటాధర' ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ తెలుగు 9 సెట్‌కి గెస్ట్‌గా వచ్చారు, ఇది ఆమెకు ఒక 'ఫుల్ సర్కిల్ మొమెంట్' అని తెలిపారు. (ఆమె ఇంతకు ముందు హిందీ'బిగ్ బాస్ 18'లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు).ఆమె ఈ చిత్రంలో 'శోభ' అనే ఆసక్తికరమైన పాత్రను పోషిస్తున్నారు, ఈ పాత్రకు డబ్బు పట్ల అత్యాశ ఉంటుందని తెలిపారు. ఈ పాత్ర తనకు చాలా సవాలుగా ఉందని కూడా చెప్పారు.
సుదీర్ఘ విరామం తర్వాత 'జటాధర'తో తెలుగులోకి ప్రవేశించడం సంతోషంగా ఉందని, తెలుగు సినిమా అత్యుత్తమ దశలో ఉందని ఆమె అన్నారు. తన సోదరి నమ్రత శీరోద్కర్, బావ మహేష్ బాబు హైదరాబాద్‌లో ఉండటం వలన హైదరాబాద్ తనకు రెండో ఇల్లు లాంటిదని చెప్పారు. మహేష్ బాబు తమ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. మహేష్ బాబును "ఈ విశ్వంలోనే అత్యంత దయగల , మధురమైన వ్యక్తి" అని ప్రశంసించారు. నటులు సుధీర్ బాబు, సోనాక్షి సిన్హాతో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ, సెట్‌లోకి అడుగుపెట్టాక అందరూ నటులుగా ఎంతో వృత్తిపరంగా మెలిగారని పేర్కొన్నారు 'జటాధర' నవంబర్ 7 విడుదల కానుంది.