Actress Hansika: హీరోయిన్ హన్సికకు బాంబే హైకోర్టు షాక్

బాంబే హైకోర్టు షాక్

Update: 2025-09-11 15:16 GMT

Actress Hansika: హీరోయిన్ హన్సిక మోత్వానీకి గృహ హింస కేసులో బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆమె దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో హన్సికతో పాటు ఆమె తల్లి జ్యోతిపైనా గృహ హింస చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ, టీవీ నటి ముస్కాన్ జేమ్స్‌ను 2020లో వివాహం చేసుకున్నారు. అయితే 2022లో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముస్కాన్, హన్సికతో పాటు ఆమె సోదరుడు ప్రశాంత్, తల్లి జ్యోతిలపై గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై సెషన్స్ కోర్టు హన్సిక, ఆమె తల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ తమపై నమోదైన కేసును పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ హన్సిక, ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం వారి పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags:    

Similar News