Case Filed Against Tollywood Hero’s Wife: టాలీవుడ్ హీరో భార్యపై పంజాగుట్ట పీఎస్ లో కేసు

హీరో భార్యపై పంజాగుట్ట పీఎస్ లో కేసు

Update: 2025-12-02 05:53 GMT

Case Filed Against Tollywood Hero’s Wife: టాలీవుడ్ నటుడు ధర్మ మహేశ్ (సిందూరం, డ్రింకర్ సాయి చిత్రాల హీరో) భార్య గౌతమి చౌదరిపై కేసు నమోదైంది.RJ శేఖర్ బాషా ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పీఎస్ లో గౌతమి చౌదరిపై కేసు నమోదైంది. తనను, తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన తల్లిని, కూతురిని ఉద్దేశించి గౌతమి చౌదరి సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, అలాగే చంపుతానని బెదిరించారని ఆరోపిస్తూ శేఖర్ బాషా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గౌతమి చౌదరిపై గౌతమిపై బీఎన్​ఎస్​351(3), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

2025 ఆగస్టులో నటుడు ధర్మ మహేశ్‌పై ఆయన భార్య గౌతమి చౌదరి ఫిర్యాదు చేయడం ద్వారానే ఈ మొత్తం వివాదం మొదలైంది. భర్త ధర్మ మహేశ్, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని, మరో యువతితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ గౌతమి గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.అప్పటి నుంచి వీరిద్దరూ ఒకరిపై ఒకరు మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో శేఖర్ భాషా ధర్మ మహేశ్ భార్య గౌతమి చౌదరిపై ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News