Chinmayi Files Complain: అసభ్యంగా బూతులు తిడుతున్నరు.. సజ్జనార్ కు చిన్మయి కంప్లైంట్
సజ్జనార్ కు చిన్మయి కంప్లైంట్
Chinmayi Files Complain: సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబంపై అసభ్యకరమైన ట్రోలింగ్ చేసిన వ్యక్తులపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు టాలీవుడ్ ప్రముఖ సింగర్ చిన్మయి. ఇటీవల తన భర్త మంగళసూత్రం గురించి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తనను, తన పిల్లలను లక్ష్యంగా చేసుకుని బూతులు తిట్టడం, పిల్లలు చనిపోవాలని కోరుకోవడం వంటి తీవ్రమైన వేధింపులకు పాల్పడుతున్నారని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆన్‌లైన్ వేధింపులపై చర్య తీసుకోవాలని కోరుతూ ఆమె హైదరాబాద్ సీపీ సజ్జనార్ ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై సజ్జనార్ స్పందించి, సంబంధిత పోలీసు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
చిన్మయి భర్త, నటుడు -దర్శకుడు రాహుల్ రవీంద్రన్, మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా తన భార్య (చిన్మయి) వ్యక్తిగత నిర్ణయం అని, తాను బలవంతం చేయనని ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు , ట్రోలింగ్ మొదలైనప్పుడు, చిన్మయి స్పందించారు."మంగళసూత్రం ధరించడం వల్ల మహిళలకు భద్రత ఉంటుందని ఒక నెటిజన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా," మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు లేదా హింసను ఆపలేదు. పుట్టుక నుంచి మరణం వరకు ఈ సమాజంలో మహిళలకు నిజమైన భద్రత లేదు. చాలాచోట్ల మృతదేహాలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. మంగళసూత్రం వివాదం కారణంగా ట్రోలర్లు తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు చిన్మయి చాలా తీవ్రంగా స్పందించారు.
నా అభిప్రాయాలు నచ్చకపోతే విస్మరించండి, అంతే కానీ పిల్లలు చనిపోవాలని కోరుకోవడం లాంటి కల్చర్ సరైందేనా?"కొందరు ట్రోలర్లు తన పిల్లలు పురిట్లోనే చనిపోతే బాగుండు అని కూడా కామెంట్ చేశారని, ఇలాంటి వ్యాఖ్యలను చూసి పిల్లలు బతకలేరని ఆవేదన వ్యక్తం చేశారు.తాను వేధింపుల గురించి ఫిర్యాదు చేస్తూనే ఉంటానని, ఈ కేసు ఎంత కాలం పట్టినా న్యాయం కోసం పోరాడతానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తనపై విమర్శలు చేసిన నెటిజన్లపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు చిన్మయి.