Chiranjeevi: సమంత, రాజ్ దంపతులకు చిరంజీవి స్పెషల్ విషెస్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్!
నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్!
Chiranjeevi: టాలీవుడ్ బ్యూటీ సమంత బాక్సాఫీస్ వద్ద మామూలు వేట ఆడట్లేదు. సామ్ ప్రధాన పాత్రలో, నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మా ఇంటి బంగారం' థియేటర్లలో దూసుకుపోతోంది. కేవలం నాలుగే నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 50 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ అంతా ఫుల్ జోష్‌లో ఉంది.
ఈ గ్రాండ్ సక్సెస్ ఉత్సాహంలో.. సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ,చిత్ర బృందం అంతా కలిసి మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ గారు సామ్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. పూలబొక్కే ఇచ్చి, శాలువాతో ఘనంగా సత్కరించారు.
అయితే ఈ సంతోషకరమైన క్షణాలను మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక పెద్ద సంచలనంగా మారింది, నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
చిరంజీవి తన పోస్ట్‌లో ఏమన్నారంటే.."‘మా ఇంటి బంగారం’ సినిమా చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్‌ను బ్యాలెన్స్ చేస్తూ, నందినీ రెడ్డి తనదైన శైలిలో సినిమాను ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు. ముఖ్యంగా చీరకట్టులో సమంత చేసిన యాక్షన్ సీన్స్ థియేటర్లలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి వైవిధ్యమైన, ఉమెన్-సెంట్రిక్ సినిమాలు ఎంతో అవసరం. ఈ విజయాన్ని అందుకున్న సమంత, నందినీ రెడ్డి, రాజ్ చిత్ర యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు. జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత, రాజ్ దంపతులకు నా ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ చిరంజీవి రాసుకొచ్చారు.
మెగాస్టార్ చేసిన ఈ ఒక్క కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సమంత, రాజ్ నిడిమోరు దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే హింట్ చిరంజీవి ఇచ్చేయడంతో.. సామ్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందా? అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.