Committee Boys: కమిటీ కుర్రోళ్లు కాంబో రిపీట్
కాంబో రిపీట్
Committee Boys: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రాళ్లు' చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో నటించిన కొత్త నటీనటులు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమాకు రెండు గద్దర్ అవార్డులు కూడా వచ్చాయి. అయితే 'కమిటీ కుర్రాళ్లు' చిత్రంలోని నటీనటులతో నిహారిక కొణిదెల తన 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై మరో సినిమా నిర్మించడానికి రెడీ అవుతున్నారు. కమిటీ కుర్రాళ్ళు దర్శకుడు యదు వంశీతో మరో సినిమా చేసేందుకు నిహారిక ప్లాన్ చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కమిటీ కుర్రాళ్లు' విజయం తర్వాత, ఆ చిత్రంలో నటించిన యువ నటులందరికీ మంచి గుర్తింపు వచ్చింది. నిహారిక కూడా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతానికి నిహారిక మానస దర్శకత్వంలో సంగీత్ శోభన్, నయన్ సారికతో కలిసి ఓ మూవీ నిర్మిస్తోంది.