Dandora Movie: ఓటీటీలోకి ‘దండోరా’: సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Update: 2026-01-10 13:11 GMT

Dandora Movie: గ్రామీణ నేపథ్యంలో సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కిన ‘దండోరా’ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి మూడవ వారంలో (జనవరి 15 లేదా 16 నాటికి) ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు తాజా సమాచారం. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ, కేవలం రెండు వారాల్లోనే ఓటీటీ బాట పట్టడం విశేషం.

వైవిధ్యమైన కథా నేపథ్యం: మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, గ్రామీణ ప్రాంతాల్లోని కుల వివక్ష, అహంకారం, సామాజిక హోదా చుట్టూ తిరిగే సంఘర్షణలను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఒక గ్రామంలోని వ్యక్తుల మధ్య కలిగే చిన్నపాటి గొడవలు, అవి సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలకు ఎలా దారితీస్తాయనేది ఈ సినిమాలో ప్రధానాంశం. సీనియర్ నటుడు శివాజీ ఇందులో ఒక రిజిడ్ (కఠినమైన) తండ్రి పాత్రలో తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారని విమర్శకులు కొనియాడారు.

నటీనటుల ప్రతిభ: శివాజీతో పాటు నవదీప్ (సర్పంచ్ పాత్రలో), నందు, రవికృష్ణ, బిందు మాధవి, మౌనికా రెడ్డి , మురళీధర్ గౌడ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు, పండుగ సెలవుల్లో ఇంట్లోనే కూర్చుని ఈ ఇంటెన్స్ సోషల్ డ్రామాను వీక్షించే అవకాశం లభించింది.

Tags:    

Similar News