Dating Rumors: తమన్న ప్రియుడితో దంగల్ బ్యూటీ డేటింగ్
దంగల్ బ్యూటీ డేటింగ్;
Dating Rumors: అమీర్ ఖాన్ దంగల్ మూవీతో ప్రపంచానికి తెలిసిన నటి ఫాతిమా సనా షేక్, అంతకు ముందు నువ్వు నేను ఒకటవుదాం అనే తెలుగు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. దంగల్ సినిమాలో నటించాక, అమీర్తో ఫాతిమా ఎఫైర్ వార్తలు బాగా ఫేమస్ అయ్యేలా చేసాయి. కానీ వారి లింకప్ వార్తలు ఇటీవల కనిపించకుండా పోయాయి. అదే సమయంలో తమన్నా నుంచి బ్రేకప్ అయిన నటుడు విజయ్ వర్మతో ఫాతిమా లింకప్ వార్తలు మొదలయ్యాయి.
ఈ జంట కొన్ని సినిమాలు, సిరీస్లలో కలిసి పని చేస్తుండటమే ఇందుకు కారణం. ఇటీవల ఓ డిన్నర్ పార్టీ నుంచి వెళుతూ ఇద్దరూ హగ్ చే సుకున్న ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. విజయ్ వర్మతో సనా షేక్ డేటింగ్లో ఉందంటూ వెంటనే పుకార్లు మొదలయ్యాయి. అయితే తాను ఇంకా ఒంటరి గానే ఉన్నానని చెప్పింది ఫాతిమా, మెట్రో ఇన్ నో మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న ఈ భామ ఒకరితో రిలేషన్షిప్లోకి వెళ్లాలంటే... ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు గౌరవించుకోవాల ని చెప్పుకొచ్చింది. ఈ సినిమా జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.