Deepika Padukone: దీపికకు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటిగా

తొలి భారతీయ నటిగా;

Update: 2025-07-04 14:56 GMT

Deepika Padukone: బాలీవుడ్ నటీమణి దీపికా పదుకొణె అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఆమెకు అంతర్జాతీయస్థాయి గౌరవం దక్కింది. 'హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026'కు ఎంపికైంది. హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారిక ప్రక టనలో దీపిక పేరును అనౌన్స్ చేసింది. మోషన్ పిక్చర్స్ విభాగంలో ఆమె ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటి దీపిక కావడం విశేషం. హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా వెల్లడించిన జాబితాలో డెమి మూర్, రాచెల్ మెక్ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి హాలీవుడ్ తారలతో పాటు దీపిక పేరు కూడా ఉంది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్హర్ 2026కు 35 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసి నట్లు ఛాంబర్ తెలిపింది. వినోదరంగం లో గణనీయమైన కృషి చేసినందు కు గాను వీళ్లను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ప్రతి సంవత్సరం వందలాది నామినేషన్ల నుంచి అత్యుత్తములను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ఎంపికైన వారిలో స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్, టీవీ, థియేటర్, సంగీతం, సినిమా ఇలా ఐదు విభాగాల నుంచి ప్రతిభావంతులున్నారు. నటనతోనే కాకుండా తన స్పీచ్లతోనూ దీపికా పదుకొణె ఆకట్టుకుంటుం ది.ఈ సందర్భంగా ఆమెకు సిని ప్రముఖులు, అభిమాను లు శుభాకాంక్షలుత చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగులో అట్లీ-అల్లు అర్జున్‌ (AA 22) కలయికలో రాబోతున్న చిత్రంలో నటిస్తుంది దీపిక. 

Tags:    

Similar News