Dhanush Gets Emotional: నా మనసుకి దగ్గరైన సినిమా ఇది.. ‘కర’ ఈవెంట్‌లో ధనుష్ ఎమోషనల్ స్పీచ్
‘కర’ ఈవెంట్‌లో ధనుష్ ఎమోషనల్ స్పీచ్
Dhanush Gets Emotional: వెర్సటైల్ యాక్టర్ ధనుష్ నుండి మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అదే ‘కర’. తన మనసుకి ఎంతో దగ్గరైన చిత్రమని ధనుష్ స్వయంగా చెప్పుకొచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందన్న ధీమా చిత్ర యూనిట్‌లో కనిపిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక అభిమానుల కోలాహలంతో అట్టహాసంగా సాగింది.
ఈ వేడుకకు టాలీవుడ్ నుండి మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్, దర్శకులు వెంకీ అట్లూరి, బుచ్చిబాబుముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా సాయి తేజ్ ‘కర’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా చాలా ఎమోషనల్‌గా, పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. ధనుష్ నటన మరోసారి నేషనల్ అవార్డ్ రేంజ్‌లో ఉండబోతోందని అతిథులు ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ.. ‘కర’ తన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అని పేర్కొన్నారు. దర్శకుడు విఘ్నేశ్ రాజా ఈ కథను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రంలో కేఎస్ రవికుమార్, కరుణాస్, జయరామ్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించడం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.
విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తమిళంలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా.. ఈనెల 30న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకులు తన సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారని, ఈ సినిమా కూడా వారి హృదయాలను గెలుచుకుంటుందని ధనుష్ ఆశాభావం వ్యక్తం చేశారు.