Mirai Team: మిరాయ్ టీంకు పార్టీ ఇచ్చిన దిల్ రాజ్

పార్టీ ఇచ్చిన దిల్ రాజ్

Update: 2025-10-06 05:28 GMT

Mirai Team: 'మిరాయ్' సినిమా విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందానికి నిర్మాత దిల్ రాజు అభినందనలు తెలిపారు. మిరాయ్' తేజ సజ్జ, మంచు మనోజ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్ల (వరల్డ్‌వైడ్‌గా) గ్రాస్ మార్క్‌ను అధిగమించింది. నార్త్ ఇండియాలో 3 మిలియన్ డాలర్లను క్రాస్ చేసింది. ఈ సినిమా విజయం సందర్భంగా దిల్ రాజు ఈ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు.

దిల్ రాజు తన నివాసంలో 'మిరాయ్' చిత్ర బృందం కోసం ఒక సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు. హీరో తేజ సజ్జ, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, చిత్ర నిర్మాణ బృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా కలిసి కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. దిల్ రాజు కుటుంబంతో కలిసి తేజ సజ్జ ఈ విజయాన్ని జరుపుకోవడం జరిగింది.

దిల్ రాజు సినీ పరిశ్రమలో పెద్ద హిట్ అయిన సినిమాలకు, ముఖ్యంగా నూతన సాంకేతికతను, దైర్యంతో కూడిన కథాంశాలను ప్రోత్సహించే విధంగా ఈ రకమైన అభినందనలు తెలియజేస్తుంటారు. 'మిరాయ్' చిత్రం పట్ల దిల్ రాజు తన ఆదరాభిమానాలను, చిత్ర బృందం కృషిని ఈ పార్టీ ద్వారా చాటుకున్నారు.

Tags:    

Similar News