Director Karthik Verma: పెళ్లి పీఠలెక్కబోతున్న టాలీవుడ్ డైరెక్టర్..వధువు ఎవరంటే?
వధువు ఎవరంటే?
Director Karthik Verma: విరూపాక్ష' సినిమా దర్శకుడు కార్తీక్ వర్మ దండు నిశ్చితార్థం చేసుకున్నారు. ఆయన డాక్టర్ వేమూరి హర్షితను వివాహం చేసుకోబోతున్నారు. ఆదివారం, సెప్టెంబర్ 28 హైదరాబాద్‌లో నిశ్చితార్థ వేడుక జరిగింది.
ఈ వేడుకకు యువ నటులు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ, సాయి దుర్గా తేజ్ తదితరులు హాజరయ్యారు. ఈ నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లి కూడా త్వరలోనే ఈ ఏడాది చివర్లో ఉండవచ్చని సమాచారం.
టాలీవుడ్‌లో యువ ప్రతిభావంతుడైన దర్శకులలో ఒకరు కార్తీక్ వర్మ దండు. ప్రస్తుతం కార్తీక్ దండు నాగ చైతన్య హీరోగా 'NC24' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా ఒక పీరియాడిక్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.
కార్తీక్ దండు దర్శకత్వం వహించిన 'విరూపాక్ష' సినిమా 2023లో విడుదలై భారీ విజయం సాధించింది. ఈ హారర్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సాయి దుర్గా తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో, దర్శకుడు అద్భుతమైన కథనంతో, భయానక వాతావరణాన్ని సృష్టించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా కార్తీక్ వర్మ దండుకు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. ఆయన ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర శిష్యుడిగా పనిచేశారు. సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించారు.