Director RJ Balaji: 22 ఏళ్ల తర్వాత సూర్య-త్రిష మ్యాజిక్.. హీరోయిన్ ఎంపికపై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హీరోయిన్ ఎంపికపై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Director RJ Balaji: నటుడిగా మెప్పించి, దర్శకుడిగా అమ్మోరు తల్లి వంటి హిట్స్ అందుకున్న ఆర్జే బాలాజీ.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కలిసి వీరభద్రుడు అనే భారీ చిత్రంతో వస్తున్నారు. ఈ సినిమా మే 14న విడుదలకు సిద్ధమవుతుండగా, మూవీ కాస్టింగ్, సంగీతం గురించి బాలాజీ పంచుకున్న విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ సూర్య, త్రిషల కాంబినేషన్. వీరిద్దరూ కలిసి ఆరు చిత్రంలో నటించిన సుమారు 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమా కోసం జతకట్టారు. గతంలోనే త్రిషతో సినిమా చేయాలని బాలాజీ అనుకున్నా కుదరలేదట. అయితే వీరభద్రుడు కథ వినగానే త్రిషకు బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పేశారట. తన షూటింగ్ పార్ట్ పూర్తయినప్పటికీ, త్రిష సెట్స్‌కు వచ్చి చిత్ర యూనిట్‌తో సమయం గడిపేవారని బాలాజీ ఆమె డెడికేషన్‌ను కొనియాడారు.
మిస్సయిన రెహమాన్.. సీన్‌లోకి సాయి అభ్యంకర్
ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో మార్పులు జరిగాయి. అమ్మోరు తల్లి తర్వాత బాలాజీ-రెహమాన్ కలిసి పనిచేయాలని అనుకున్నారు. కానీ వీరభద్రుడు షూటింగ్ మొదలైన సమయంలో రెహమాన్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తాను ఈ ప్రాజెక్టుకు పూర్తి సమయం కేటాయించలేనని నిజాయితీగా చెప్పేశారట. అప్పటికే ఒక పాట అత్యవసరం కావడంతో బాలాజీ యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ను ఎంపిక చేసుకున్నారు.