Director SS Rajamouli: నా సినిమాల్లో.. నాకు సంతృప్తినిచ్చిన మూవీ అదే..

నాకు సంతృప్తినిచ్చిన మూవీ అదే..;

Update: 2025-07-18 06:04 GMT

Director SS Rajamouli: ట్రిపుల్ ఆర్, బాహుబలి, మగధీర లాంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌలి. దర్శకుడిగా తన బెస్ట్ సినిమా ఏది అని అడిగితే ట్రిపుల్ ఆర్, లేదా బాహుబలి అని చెబుతారనుకుంటారు. కానీ జక్కన్న అలా చెప్పలేదు.

రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరైన రాజమౌళి, అక్కడ ఓ ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో మనసులో మాట చెప్పేశారు. 'నా సినీ ప్రయాణంలో మగధీర, సై, బాహుబలి, ఆర్ఆర్ఆర్” లాంటి హిస్టారికల్, విజువల్ వండర్స్ ఉన్నాకూడా, చిన్న ఈగ కథ ఆధారంగా తీసిన సైంటిఫిక్ ఫ్యాంటసీ థ్రిల్లర్ సినిమాలే. ఈగ సినిమానా బెస్ట్ మూవీ. ఎందుకంటే క్రియేటివిటీ, ఎమోషనల్ కనెక్షన్, టెక్నికల్ ఎక్సలెన్స్ ఇవన్నీ కలగలిపిన సినిమా అది. తన దర్శక జీవితంలో అత్యంత సంతృప్తికరమైన చిత్రంగా నిలిచింది అని చెప్పాడు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబుతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే..

Tags:    

Similar News