గద్దర్ అవార్డు ఉత్తమ నటుడి ఎంపికపై చర్చోపచర్చలు
Allu Arjun's selection as Best Actor at the Gaddar Film Awards is a matter of debate
గద్దర్ ఫిల్మ్ అవార్డులలో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పుష్ప2 సినిమాలో నటనకు గాను బన్నీని ఉత్తమ నటుడిగా జ్యూరీ ఎంపిక చేసింది. సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందటం, ఆమె కుమారుడికి ఆరు నెలలకు పైగా వైద్యం అందించినా పూర్తిగా కోలుకోలేదు.
ఈ వ్యవహారంలో పుష్ప హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై మంత్రుల నుంచి కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు పుష్ప సినిమాను కడిగేశారు. ఏకంగా ఒక సినిమా గురించి శాసనసభలో జరిగే స్థాయికి చేరింది. స్మగ్లర్లను హీరోలను చేసి పోలీసులను జీరో చేశారని ప్రెస్మీట్లలో ఉతికేశారు. ముఖ్యమంత్రి కూడా పరోక్షంగా సినిమాను, సినిమా హీరోపై విమర్శలు సంధించారు.
పరిస్థితులు చేయి దాటే పరిస్థితి రావడంతో ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు రాయబారం చేసి ఇరువర్గాలను సముదాయించారు. కట్ చేస్తే ఈ రోజు ప్రకటించిన గద్ధర్ సినిమా అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక జరిగింది.
ఇది ఇలా ఉంటే బన్నీ అరెస్టుపై అప్పట్లో అనేక రకాల పుకార్లు షికారు చేశాయి. ఏపి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో విభేదించటం వల్లే బన్నీని వేధించారనే వాదన ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సినిమా పెద్దలు ముఖ్యమంత్రితో టచ్ మి నాట్ గా వ్యవహరించటం ప్రభుత్వంలోని పెద్దలను నారాజ్ చేసిందని మరో వాదన ఉంది. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం చల్లబరిచేందుకు భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరిగాయని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపించాయి. పుష్పా సినిమాపై మాటల తూటాలు పేల్చిన ప్రభుత్వంలోని పెద్దలు తాజా వ్యవహారంపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.