Diwali Celebrations at Chiranjeevi’s House: చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్..

దీపావళి సెలబ్రేషన్స్..

Update: 2025-10-21 06:04 GMT

Diwali Celebrations at Chiranjeevi’s House: మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ ఏడాది దీపావళి వేడుకలు ఘనంగా, సందడిగా జరిగాయి.ఈ వేడుకలకు టాలీవుడ్‌లోని అగ్ర కథానాయకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.కింగ్ నాగార్జున , ఆయన సతీమణి అమల,విక్టరీ వెంకటేష్ ఆయన సతీమణి నీరజ, ప్రముఖ నటి నయనతార హాజరయ్యారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్రతారలు ఒకే వేదికపై తమ కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకోవడం సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి తన సోషల్ మీడియాలో పంచుకుంటూ, "నా ప్రియమైన స్నేహితులు నాగార్జున, వెంకటేష్ , నా సహనటి నయనతార కుటుంబాలతో కలిసి దీపాల పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఆనందం, ప్రేమ, ఐక్యతతో కూడిన క్షణాలు హృదయాన్ని నింపుతాయి" అని తెలిపారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

Tags:    

Similar News