Shah Rukh Khan’s Running Sentiment: షారుఖ్ రన్నింగ్ సెంటిమెంట్ గురించి మీకు తెలుసా..?
మీకు తెలుసా..?;
Shah Rukh Khan’s Running Sentiment: సినీ స్టార్లకు సెంటిమెంట్లు ఎక్కువ. సెంటిమెంట్ల ప్రకారమే వారు అన్నీ చేస్తారు. సినిమా రిలీజులు కూడా ఆ ప్రకారమే ఉంటాయి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తన కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాలను అందించారు. దాని వెనుక ఆయనది ఎంతో కృషి ఉంది. కానీ ప్రతి సినిమా విజయవంతం కావడానికి షారుఖ్ ఒక విషయాన్ని ఖచ్చితంగా నమ్ముతాడు. 1997లో రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన 'కోయ్లా' చిత్రంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. 90ల నాటి సూపర్ హిట్ చిత్రాలలో కోయ్లా ఒకటి. రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, అమ్రిష్ పూరి, జానీ లివర్ వంటి అనేక మంది పెద్ద నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.
కోయిల సినిమా వెనుక కథను షారుఖ్ ఖాన్ చెప్పారు. 'దేఖా తుజే తో' పాట షూటింగ్ సమయంలో ఆయన మోకాలికి గాయమైంది. ‘‘ఆ పాటలో, నేను గాలిలో ఎగురుతాను. అలా చేసేటప్పుడు నా మోకాలికి గాయమైంది’’ అని షారుఖ్ ఖాన్ అన్నారు.
తనకు ఓ సెంటిమెంట్ ఉన్నట్లు షారుఖ్ తెలిపారు. నేను పరిగెత్తే సన్నివేశం ఉంటే, ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పాడు. డర్ సినిమాలో సన్నీ నుండి పారిపోయినప్పుడు, ఆ సినిమా పెద్ద హిట్ అయిందన్నారు. ‘‘నేను 'కరణ్ అర్జున్' సినిమాలో పరిగెత్తాను. అది హిట్ అయింది. 'దిల్‌వాలే'లో ఆ అమ్మాయి వెంట నేను పరిగెడుతూనే ఉన్నా. అది కూడా పెద్ద హిట్ అయింది. రన్నింగ్ చేసే సీన్స్ ఉండే మూవీస్ అన్నీ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో కోయిల సినిమాలోనూ చాలా పరిగెత్తాను. అందుకే ఆ సినిమా బిగ్ హిట్ అయింది’’ అని షారుఖ్ చెప్పుకొచ్చాడు.