Baahubali: బాహుబలి ఎపిక్ టైం ఎంతో తెలుసా.?

టైం ఎంతో తెలుసా.?;

Update: 2025-07-11 09:55 GMT

Baahubali:  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి: ది బిగినింగ్, ‘బాహుబలి ది కన్‌క్లూజన్ నే రెండు భాగాల్ని కలిపి ఒక్క సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి ది ఎపిక్’గా రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ చిత్ర రన్‌టైమ్‌ రివీలైంది. దాదాపు 5 గంటల 20నిమిషాలు సినిమా ఉండనుందని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో దీనిపై ‘బాహుబలి’ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ‘కంగారు పడకండి. మేము మీ రోజు మొత్తాన్ని తీసుకోవట్లేదు. ఇది IPL మ్యాచుకు సమానం’ అని ట్వీట్ చేశారు. ఇదే నిజమైతే, ఇది భారతీయ సినిమా చరిత్రలోనే ఓ రికార్డు స్థాయి ట్రెండ్ సెట్ చేసే ఘటన అవుతుంది.

బాహుబలి విడుదలైన పదేళ్ల తర్వాత కూడా దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అప్పట్లో రికార్డులు సృష్టించిన ఈ సినిమాను మళ్లీ పెద్ద స్క్రీన్‌పై చూడాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా, రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా చూడాలనే ఆలోచన సినిమా ప్రియులకు మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఈ రీ-రిలీజ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి, కొన్ని భారీ సినిమాలు మొదటిసారి కలెక్ట్ చేసే వసూళ్లను కూడా ఇది అధిగమించవచ్చని భావిస్తున్నారు.

Tags:    

Similar News