Aishwarya Rai: నా ఫోటోలు, పేరు వాడొద్దు..ఢిల్లీ హైకోర్టుకు ఐశ్వర్యా రాయ్

ఢిల్లీ హైకోర్టుకు ఐశ్వర్యా రాయ్

Update: 2025-09-10 04:39 GMT

Aishwarya Rai: బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫోటోలు, వీడియోలను, అలాగే AI ద్వారా మార్ఫింగ్ చేసిన అశ్లీల కంటెంట్‌ను అనధికారికంగా ఉపయోగించకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు.తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తూ, తన పేరు, ఫోటోలను, AI-జనరేటెడ్ కంటెంట్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

కొన్ని వెబ్‌సైట్లు , వ్యక్తులు ఆమె పేరు, ఫోటోలను ఉపయోగించి డబ్బు సంపాదిస్తున్నారని, ఇది చట్టవిరుద్ధమని ఆమె న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఉదాహరణకు, "ఐశ్వర్య నేషన్ వెల్త్" అనే కంపెనీ ఆమెను తమ ఛైర్‌పర్సన్‌గా పేర్కొంటూ మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతోందని తెలిపారు. AI-జనరేటెడ్ అశ్లీల ఫోటోలు, వీడియోలు ఆమె ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని, అవి ఆమె గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని తెలిపారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, ఐశ్వర్య రాయ్ వ్యక్తిత్వ హక్కులను పరిరక్షించడానికి, అనధికారిక దుర్వినియోగాన్ని నిలిపివేయడానికి తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేస్తామని సూచించింది. తదుపరి విచారణ జనవరి 15కు వాయిదా వేసింది కోర్టు.

Tags:    

Similar News