‘Dude’ Collections: డ్యూడ్ కలెక్షన్లు...4 రోజుల్లో 83 కోట్లు
4 రోజుల్లో 83 కోట్లు
‘Dude’ Collections: ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన 'డ్యూడ్' (Dude) సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ సృష్టిస్తోంది. తన కెరీర్ లోనే అత్యధికంగా కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్స్ రూ. 83 కోట్లు వచ్చాయి. ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలైనది. నాలుగు రోజుల్లోనే ఈ అద్భుతమైన కలెక్షన్లు సాధించింది.
తొలి రోజు (Day 1) గ్రాస్: రూ. 22 కోట్లకు పైగా (ప్రపంచవ్యాప్తంగా).4 రోజుల ఇండియా నెట్ కలెక్షన్స్ (సుమారుగా) రూ. 41.55 కోట్లు. తమిళ వెర్షన్ నెట్ రూ. 31 కోట్లు (సుమారుగా)
తెలుగు వెర్షన్ నెట్ రూ. 10.55 కోట్లు (సుమారుగా). ఈ చిత్రం త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.
కీర్తిశ్వరం అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కేవలం రూ. 27 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడిన 'డ్యూడ్', ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని నిర్మాతలకి భారీ లాభాల పంట పండిస్తోంది. ఈ విజయం మైత్రీ మూవీ మేకర్స్‌కి మరో బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్‌గా నిలిచిపోయే అవకాశం ఉంది.