Neglected Condition of Legendary Director Dasari’s Memorial: లెజెండరీ డైరెక్టర్ దాసరి సమాధి దుస్థితిపై ఫ్యాన్స్ ఆగ్రహం.. రంగంలోకి దిగి క్లీన్ చేయించిన మంచు మనోజ్, గీతా ఆర్ట్స్..

రంగంలోకి దిగి క్లీన్ చేయించిన మంచు మనోజ్, గీతా ఆర్ట్స్..

Update: 2026-05-30 12:20 GMT

Neglected Condition of Legendary Director Dasari’s Memorial: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా, ఎంతోమంది నటీనటులకు, సాంకేతిక నిపుణులకు జీవితాన్నిచ్చిన దిగ్గజ దర్శకుడు, కీర్తిశేషులు దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియాలో ఒక వీడియో తీవ్ర దుమారం రేపింది. ఆయన స్మారక చిహ్నం సంరక్షణ కరువై, పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయిన హృదయవిదారక దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. మే 30న ఆయన వర్ధంతి రోజే ఈ ఘోరమైన పరిస్థితి వెలుగుచూడటంతో సినీ అభిమానులు, పరిశ్రమ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి, ఆగ్రహానికి గురయ్యాయి.

అయితే ఈ విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ యువ హీరో మంచు మనోజ్, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తక్షణమే స్పందించి అభినందనీయమైన చర్యలు చేపట్టారు.

హృదయాన్ని కలచివేసిన దృశ్యాలు

దర్శకరత్న దాసరి నారాయణరావు, ఆయన సతీమణి పద్మ గార్ల సమాధులు ఉన్న ప్రదేశం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి, అనాథ శవంలా ఆ ప్రాంతం మారిపోవడాన్ని చూసి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ పెద్దలపై విమర్శలు గుప్పించారు. తెలుగు సినిమాను దశాబ్దాల పాటు శాసించిన ఒక లెజెండరీ పర్సనాలిటీకి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అంటూ ఫ్యాన్స్ చలించిపోయారు.

స్వయంగా రంగంలోకి దిగిన హీరో మంచు మనోజ్

ఈ సోషల్ మీడియా వీడియో చూసి తీవ్రంగా చలించిపోయిన హీరో మంచు మనోజ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దాసరి సమాధి ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. పరిశ్రమకు కన్నతండ్రి లాంటి మహానుభావుడి స్మారకం ఇలాంటి దుస్థితిలో ఉండటంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం ట్వీట్లతోనో, మాటలతోనో సరిపెట్టకుండా మనోజ్ ఒక అడుగు ముందుకు వేశారు. తనతో పాటు ప్రత్యేక సిబ్బందిని వెంటబెట్టుకుని వెళ్లారు. స్వయంగా అక్కడే ఉండి, సమాధి చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, చెత్తను శుభ్రం చేయించే పనులను పర్యవేక్షించారు. ఆ ప్రాంతమంతా క్లీన్ అయిన తర్వాత దాసరి, పద్మ గార్ల సమాధులకు పూలమాలలు వేసి, చేతులు జోడించి ఘన నివాళులర్పించారు.

చేతులు కలిపిన గీతా ఆర్ట్స్

మంచు మనోజ్ చొరవకు తోడుగా

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ '

గీతా ఆర్ట్స్ కూడా ఈ ఘటనపై తక్షణమే స్పందించింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ తమ సిబ్బందిని అక్కడికి పంపించి, స్మారక ప్రదేశాన్ని పూర్తిగా శుభ్రపరిచే పనుల్లో భాగస్వామ్యం పంచుకుంది. దీంతో కొద్ది గంటల్లోనే ఆ ప్రాంతం మళ్లీ గౌరవప్రదంగా మారింది.

Tags:    

Similar News