Actress Priyamani’s Interesting Comments: చాలా గర్వంగా ఉంది.. నటి ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నటి ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Update: 2025-10-25 13:02 GMT

Actress Priyamani’s Interesting Comments: ప్రముఖ నటి ప్రియమణి దక్షిణాది చిత్ర పరిశ్రమకు లభిస్తున్న అపూర్వ ఆదరణపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రాంతీయ చిత్రాలను పెద్దగా పట్టించుకోని ప్రేక్షకులు ఇప్పుడు వాటిని విశేషంగా ఆదరిస్తుండటం ఒక గొప్ప సానుకూల మార్పుగా ఆమె అభివర్ణించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ.. "ప్రేక్షకులు ఇప్పటికైనా దక్షిణాది సినిమాలను చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటినుంచో ఇక్కడ అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. కానీ గతంలో వాటికి సరైన ప్రాధాన్యత దక్కలేదు" అని అన్నారు.

గతంలో ప్రతి భాషలో అద్భుతమైన చిత్రాలు రూపొందించినా, వాటి గురించి కూడా ఎవరూ మాట్లాడేవారు కాదని ప్రియమణి గుర్తు చేసుకున్నారు.కానీ ఇప్పుడు అలాంటి చిత్రాలే దేశవ్యాప్తంగా భారీ విజయాలు సాధించడం నిజంగా గొప్ప విషయం" అని తెలిపారు. ప్రాంతీయ, హిందీ చిత్రాల మధ్య ఉన్న అడ్డుగోడలు నెమ్మదిగా తొలగిపోతున్నాయని, భవిష్యత్తులో ఈ సరిహద్దులు పూర్తిగా చెరిగిపోవాలని తాను ఆశిస్తున్నట్లు ప్రియమణి తెలిపారు.

సాంకేతిక నిపుణులకు గుర్తింపు:

ఈ సానుకూల మార్పు కేవలం నటీనటులకే కాక సినిమాల వెనుక ఉన్న దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణుల గురించి కూడా చర్చకు దారి తీయడం పరిశ్రమకు ఎంతో మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మార్పు ఎంతో అవసరమని, ఇది తనకు మరింత సంతోషాన్ని కలిగిస్తోందని వివరించారు.

ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్:

ప్రస్తుతం ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలతో మెప్పిస్తున్నారు. తెలుగులో ఆమె చివరిగా కస్టడీ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం హిందీ, తమిళ భాషల్లో నటిస్తున్న ఆమె, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న పాపులర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్-3లో కీలక పాత్రలో కనిపించనున్నారు.

Tags:    

Similar News