Big Update from Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగ.. ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బిగ్ అప్డేట్..
ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బిగ్ అప్డేట్..;
Big Update from Ustaad Bhagat Singh: పవర్ స్టార్ అభిమానులకు పండగ లాంటి వార్త ఇది. హరి హర వీరమల్లు విజయం తర్వాత ఫుల్ జోష్లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అదే జోష్ను కంటిన్యూ చేయబోతున్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్‌సింగ్' చిత్రం నుండి కీలక అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్.
2023 లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ గత రెండేళ్లుగా ఆగిపోయింది. పవర్ స్టార్ రాజకీయాల్లో బీసీ కావడంతో డేట్లు కాలిగా లేక సినిమా షూటింగ్ నిలిపి వేసారు నిర్మాతలు. అయితే తాజాగా పవర్ స్టార్ టైం ఇవ్వడంతో శర వేగంగా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. మూవీ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి అయినట్లు మైత్రి మూవీ మేకర్స్ 'ఎక్స్' వేదికగా పోస్టు చేసింది.,
భావోద్వేగాలు యాక్షన్‌తో కూడిన అద్భుతమైన క్లైమాక్స్.. నబకాంత్ మాస్టర్ పర్యవేక్షణలో షూటింగ్ ముగిసింది. ఏపీ డిప్యూటీ సీఎంగా బీసీ గా ఉన్నప్పటికీ, పవర్ స్టార్ షూటింగ్‌ను వేగంగా పూర్తి చేశారని ..ఇది ఆయన అంకితభావం, కష్టపడి పనిచేసే స్వభావానికి నిదర్శనం" అంటూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.
కాగా 2016 లో రిలీజ్ అయిన తమిళ సినిమా తేరి ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. పవర్ స్టార్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాశీఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమా కు సంగీతం అందిస్తున్నారు. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పవన్, హరీశ్ శంకర్ కాంబో వస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.