‘Ustaad Bhagat Singh’ Lyrical Song Released: సినిమా చరిత్రలో తొలిసారి.. లక్ష మందితో ఉస్తాద్ భగత్ సింగ్ లిరికల్ సాంగ్ రిలీజ్

లక్ష మందితో ఉస్తాద్ భగత్ సింగ్ లిరికల్ సాంగ్ రిలీజ్

Update: 2025-12-13 11:59 GMT

‘Ustaad Bhagat Singh’ Lyrical Song Released: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ టీమ్ భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ సినిమాలోని తొలి పాట లిరిక్ షీట్‌ను లక్ష మంది అభిమానుల చేతుల మీదుగా ఆవిష్కరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ వినూత్న ప్రచారాన్ని నిర్వహించడానికి ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది.

దేఖ్ లేంగే సాలా అంటూ సాగే ఈ తొలి పాట లిరిక్ షీట్‌ను లాంచ్ చేసేందుకు, అభిమానులు ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కొన్ని సులభమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

లక్ష మంది అభిమానులు తమ ఎంట్రీలను నమోదు చేసిన వెంటనే అదే వెబ్‌సైట్‌లో లిరిక్ షీట్ ప్రత్యక్షమవుతుంది. ఈ వినూత్న ప్రచారంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ పాటను ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు.

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో వస్తున్న సినిమా ఇది కావడంతో అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

దేఖ్ లేంగే సాలా పాటకు భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Tags:    

Similar News