Former Miss India Celina Jaitley Hogg: భర్తపై గృహహింస కేసు..రూ.50 కోట్లు భరణం ఇవ్వాలంటున్న హీరోయిన్
రూ.50 కోట్లు భరణం ఇవ్వాలంటున్న హీరోయిన్
Former Miss India Celina Jaitley Hogg: బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జెట్లీ హాగ్ (Celina Jaitly Haag) తన భర్త, ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్ (Peter Haag)పై గృహ హింస కేసు దాఖలు చేశారు. నవంబర్ 25న ముంబైలోని అంధేరి కోర్టులో గృహ హింస చట్టం-2005 కింద ఆమె ఈ పిటిషన్ దాఖలు చేశారు.
తన భర్త పీటర్ హాగ్ తనపై తీవ్రమైన మానసిక, శారీరక, లైంగిక, ఆర్థిక ,మాటలతో కూడిన వేధింపులకు పాల్పడ్డాడని సెలీనా ఆరోపించారు.పీటర్ హాగ్ కారణంగా తాను ఆస్ట్రియాలోని తమ ఇంటి నుంచి అర్ధరాత్రి పారిపోయి భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చిందని తెలిపారు.తనను "పనిమనిషి" అని పిలవడం, జాతి విద్వేషంతో కూడిన అవమానకరమైన మాటలు వాడటం వంటివి చేశాడని ఆరోపించారు.వివాహం తర్వాత తనను ఉద్యోగం చేయకుండా అడ్డుకున్నాడని, తన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని హరించాడని పేర్కొన్నారు.పిల్లల సంరక్షణ విషయంలో తనకు పూర్తి అడ్డంకులు సృష్టిస్తున్నాడని, పిల్లలు ప్రస్తుతం పీటర్ హాగ్ కస్టడీలో ఆస్ట్రియాలో ఉన్నారని తెలిపారు.
భరణం కింద రూ.50 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. నెలకు రూ.10 లక్షలు భరణం ఇవ్వాలని కోరారు.తన పిల్లలను కలిసేందుకు అడ్డంకులు లేని విధంగా అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.కోర్టు సెలీనా పిటిషన్‌ను పరిశీలించి, పీటర్ హాగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 12న జరగనుంది.
జూలై 23, 2011న ఆస్ట్రియాలోని 1,000 సంవత్సరాల పురాతనమైన ఆశ్రమంలో వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో ఇద్దరు కవల అబ్బాయిలకు తల్లిదండ్రులు అయ్యారు. కొన్నేళ్ల తర్వాత 2017లో, జైట్లీ మరో కవలలకు జన్మనిచ్చింది. అయితే, అనారోగ్య కారణాలతో వారిలో ఒకరు ఒకరు గుండె లోపం కారణంగా ప్రాణాలు కోల్పోయారు.