Anupama Parameswaran: ఇకపై నా ఇష్టం, నాదే నిర్ణయం.. సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్ పోస్ట్..

అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్ పోస్ట్..

Update: 2026-07-20 07:20 GMT

Anupama Parameswaran: టాలీవుడ్ ప్రముఖ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తన మనసుకు ప్రశాంతత దొరికిందంటూ, తన జీవితంపై తీసుకున్న కీలక నిర్ణయాలను ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఇకపై తన జీవితానికి సంబంధించిన ప్రతి నిర్ణయం, గొంతుక తనవేనని ఆమె స్పష్టం చేశారు.

నా గొంతుకను నేనే ఎంచుకుంటా..

తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ, కొన్నిసార్లు జీవితంలో నిజమైన శాంతిని పొందాలంటే కొన్ని బంధాలను లేదా విషయాలను వదిలిపెట్టక తప్పదని అనుపమ పేర్కొన్నారు. "ఈ రోజు నాకు పూర్తి ప్రశాంతత లభించింది. ఇవాల్టి నుంచి నా జీవితాన్ని, నా గొంతుకను నేనే ఎంచుకుంటాను. నా నిర్ణయాలకు ఇక ఎవరి అనుమతులూ అవసరం లేదు, దేనికీ భయపడను. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకుంటూ నా జీవితాన్ని ప్రేమిస్తున్నాను" అని రాసుకొచ్చారు. ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న ఈ నిజాన్ని, గతంలో చెప్పేందుకు వీలుపడలేదని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.

కష్టకాలంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, వారి ప్రార్థనలు, సందేశాలు తనకు ఎంతో ధైర్యాన్నిచ్చాయని చెప్పారు. తనను మళ్లీ తనలా మార్చినందుకు ప్రకృతికి కృతజ్ఞతలు చెబుతూ, తన స్వేచ్ఛను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు అనుపమ ఈ పోస్ట్‌ను ముగించారు.

భోగి చిత్రంలో కందుల సులోచన రాణిగా..

ఒకవైపు సోషల్ మీడియాలో ఈ చర్చ నడుస్తుండగానే, అనుపమ తన ప్రొఫెషనల్ కెరీర్‌తోనూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె శర్వానంద్ హీరోగా, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా భోగి లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో శర్వానంద్ గంగ అనే పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.

Tags:    

Similar News