Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఒక్క రోజు ముందుగానే రాజాసాబ్

ఒక్క రోజు ముందుగానే రాజాసాబ్

Update: 2025-12-18 06:39 GMT

Raja Saab: ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ది రాజా సాబ్' సినిమా ఒక్క రోజు ముందుగానే విడుదల కానుంది. ఈ సినిమా జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే జనవరి 8న పెయిడ్ ప్రీమియర్స్ ఉండే అవకాశం ఉందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు.

మారుతి డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీ హారర్ రొమాంటిక్ కామెడీ. ప్రభాస్‌ను చాలా కాలం తర్వాత వింటేజ్ లుక్‌లో, ఫన్ అండ్ ఎనర్జిటిక్ పాత్రలో ఈ సినిమాలో చూడవచ్చు. ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ అందించిన 'సహానా సహానా' మెలోడీ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

ప్రీ-రిలీజ్ ఈవెంట్: ఈ సినిమా భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబర్ 27, 2025న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. సోషల్ మీడియాలో విడుదల తేదీ వాయిదా పడుతుందనే వార్తలు వచ్చినప్పటికీ, నిర్మాతలు ఆ వార్తలను కొట్టిపారేశారు. సినిమా అనుకున్న సమయానికే (జనవరి 9న) వస్తుందని స్పష్టం చేశారు. ఈ సినిమా రన్ టైమ్ సుమారు 3 గంటల వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News