Hari Hara Veera Mallu Day 1 Collections: హరిహరవీరమల్లు మొదటి రోజు కలెక్షన్లు.. బాక్సాఫీస్ కొల్లగొట్టిందా.?

బాక్సాఫీస్ కొల్లగొట్టిందా.?;

Update: 2025-07-25 05:50 GMT

Hari Hara Veera Mallu Day 1 Collections:  హరి హర వీరమల్లు నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సందడి చేస్తోంది. ఈసినిమాకు మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. నాసిరకం గ్రాఫిక్స్ ఉన్నాయని..ఫస్టా హాఫ్ బాగుందని..సెకండాఫ్ కొంచెం డల్ అయిందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ నటన, యాక్షన్ సన్నివేశాలకు మంచి స్పందన వస్తోంది .టాక్ ఎలా ఉన్నప్పటికి మొదటి రోజు ఎన్ని కలెక్షన్లు వచ్చాయో ఒక్కసారి చూద్దాం

ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారా సుమారు రూ. 12.7 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది.మొదటి రోజు భారత్ లో రూ. 31.5 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించిందని అంచనా. ప్రీమియర్లు, మొదటి రోజు కలెక్షన్లు కలిపి మొత్తం రూ. 44.20 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. గతంలో 'వకీల్ సాబ్' రూ. 40.1 కోట్లు సాధించింది. సినిమాకు వచ్చిన మిక్స్ డ్ టాక్ కారణంగా రెండవ రోజు కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి. వారాంతంలో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సక్సెస్ మీట్ లో మాట్లాడిన పవన్ కళ్యాణ..ఈ సినిమాకు ప్రీమియర్ షోల ద్వారా రూ. 30 కోట్లు వచ్చాయని చెప్పారు. తనకు కలెక్షన్లు ముఖ్యం కాదని అన్నారు. సినిమా అనేది కథ చెప్పడానికి గొప్ప మాధ్యమం అని అన్నారు.

హరిహర వీరమల్లుకి ప్రపంచవ్యాప్తంగా రూ. 126 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో రూ. 103 కోట్ల షేర్, రూ. 210 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది. తెలుగు వెర్షన్ మొదటి రోజు సగటున 57.39% అక్యుపెన్సీని నమోదు చేసింది. హైదరాబాద్ (66.75%), విజయవాడ (77%) వంటి ప్రాంతాల్లో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి. ఆగస్టు చివరి నాటికి ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News