Hari Hara Veera Mallu OTT Release: ఓటీటీలోకి హరిహరవీరమల్లు..ఎపుడంటే.?
ఎపుడంటే.?;
Hari Hara Veera Mallu OTT Release: పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూలై 24 న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయింది. దారుణమైన వీఎఫ్ఎక్స్, బలహీనమైన సెకాండాఫ్ తో సినిమా ఫ్యాన్స్ ను నిరాశపర్చింది. ఈ సినిమా మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.64 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
రిలీజైన ఏడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 109 కోట్లకు పైగా గ్రాస్ ..ఇండియాలో 80.37 కోట్ల నెట్ వచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ కింగ్డమ్ విడుదల కావడంలో హరిహర వీరమల్లు వసూళ్లపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కింగ్డమ్ మూవీ టాక్ పాజిటివ్ గా ఉంటే హరిహర వీరమల్లు కలెక్షన్లు దాదాపు ఎండింగ్ కు వచ్చినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే కనుక జరిగే సినిమా భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే.. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22 న వీరమల్లు స్ట్రీమింగ్ అయ్యే చాన్స్ ఉంది. అయితే తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. సాధారణంగా ఒక పెద్ద సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత 4 నుంచి 8 వారాల మధ్య ఓటీటీలోకి వస్తుంది. 'హరిహర వీరమల్లు' విషయంలో కూడా ఇదే ఫార్ములా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.