Kingdom Day 1 Collections: కింగ్డమ్ మొదటి రోజు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే.?
ఎన్ని కోట్లంటే.?;
Kingdom Day 1 Collections: విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' సినిమా మొదటి రోజు మంచి వసూళ్లను సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.18 కోట్లు వసూలు చేసినట్టు చెబుతున్నారు. భారత్ లో నెట్ కలెక్షన్స్ రూ. 7.07 కోట్ల నుంచి రూ. 15.75 కోట్ల మధ్య ఉన్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. అమెరికాలో ప్రీమియర్లు, మొదటి రోజు కలెక్షన్లతో కలిపి 1.1 మిలియన్లకు పైగా (సుమారు రూ.,8 కోట్ల కంటే ఎక్కువ) వసూలు చేసినట్టు సమాచారం
ఈ కలెక్షన్స్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యుత్తమ ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచాయి. అయితే ఇది 'లైగర్' (Liger) మొదటి రోజు కలెక్షన్లను దాటలేకపోయింది. సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో వారాంతంలో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే రూ. 53.50 కోట్ల షేర్ రాబట్టాలి.
విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన కింగ్డమ్ జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విజయ్ , సత్యదేవ్ నటన, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సన్నివేశాలు,అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కు మంచి ప్రశంసలు లభించాయి. అయితే, కథనంలో స్థిరత్వం లేకపోవడం, రెండో సగం హడావుడిగా ఉండడం, కథలో భావోద్వేగ సీన్స్ లో డెప్త్ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.