Actress Radhika Taken Ill: ప్రముఖ నటి రాధికకు అస్వస్థత

రాధికకు అస్వస్థత;

Update: 2025-08-01 11:59 GMT

Actress Radhika Taken Ill:  ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జూలై 28న ఆమెను చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. మొదట సాధారణ జ్వరంగా భావించినప్పటికీ, వైద్య పరీక్షల అనంతరం ఆమెకు డెంగ్యూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే, పూర్తిగా కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 5 వరకు ఆమె ఆసుపత్రిలోనే ఉండే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. రాధిక కుమార్తె రాయన్ మిథున్ కూడా తన తల్లి ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఇంటికి తిరిగి వస్తారని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ప్రస్తుతం రాధిక నాంగు వాళి శాలై (Naangu Vazhi Saalai) అనే తమిళ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది డిసెంబర్ 14, 2026న విడుదల కానుంది. ధ్రువ నక్షత్రం (Dhruva Natchathiram) ఇది గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా. రాధిక ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. సూర్య 46 చిత్రంలో రాధిక నటిస్తున్నారు. ఇది కూడా 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News