Harihara Veeramallu: హరిహర వీరమల్లు..పవన్ ఖాతాలో హిట్ పడినట్టేనా.?
పవన్ ఖాతాలో హిట్ పడినట్టేనా.?;
Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. జులై 23న రాత్రి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించబడ్డాయి. ప్రీమియర్ షోలు, ట్విట్టర్ రివ్యూలు పాజిటివ్ గా వస్తున్నాయి. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, ఎం.ఎం. కీరవాణి సంగీతం హైలైట్ గా నిలిచాయని చాలా మంది చెబుతున్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉన్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రతీ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారని..గ్రాఫిక్స్ కూడా బాగున్నాయని చెబుతున్నారు. ఇద్దరు డైరెక్టర్లు కథను బాగా డైరెక్ట్ చేశారని చెబుతున్నారు.ఇప్పటి వరకు వచ్చిన సోషల్ మీడియా టాక్ మాత్రం పాజిటివ్ గా ఉంది.
ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందింది. మొదటి భాగానికి HHVM: Part 1-Sword vs Spirit అనే టైటిల్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించారు. సత్యరాజ్, నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి వంటి ఇతర నటులు కూడా కీలక పాత్రల్లో ఉన్నారు.
ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి ప్రారంభించగా, ఆ తర్వాత ఎ. ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఎ.ఎం. రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించారు. ఎం. ఎం. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు.సినిమా రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలు. సెన్సార్ బోర్డు నుండి ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది.