Actor Govinda: నాకన్నా హీరోయిన్లతోనే ఎక్కువ గడిపాడు.. నా మొగుడు మంచోడు కాదు
నా మొగుడు మంచోడు కాదు
Actor Govinda: బాలీవుడ్ నటుడు గోవింద గారి భార్య సునీత అహూజా తన వైవాహిక జీవితం గురించి, గోవింద ప్రవర్తన గురించి ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఆయన (గోవింద) నా కన్నా హీరోయిన్లతోనే ఎక్కువ సమయం గడిపాడు. 40 రోజుల పాటు షూటింగ్‌లకు వెళ్లేవారు, నేను ఇంట్లోనే ఉండిపోయాను." అని ఆమె అన్నారు. ఒక స్టార్ హీరో భార్యగా ఉండటం గురించి మాట్లాడుతూ, "ఒక స్టార్ భార్య కావాలంటే చాలా బలమైన మనస్సు ఉండాలి. గుండెను రాయి చేసుకోవాలి. ఈ విషయం అర్థం చేసుకోవడానికి నాకు 38 ఏళ్ల వైవాహిక జీవితం పట్టింది. యవ్వనంలో నాకు ఈ విషయాలు తెలియలేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
గోవింద మంచి కొడుకు, మంచి సోదరుడు కానీ మంచి భర్త మాత్రం కాదని సునీత స్పష్టం చేశారు."వచ్చే జన్మలో ఆయన నాకు భర్తగా వద్దు. నా కొడుకుగా పుట్టాలి. ఏడు జన్మలు కాదు, ఈ ఒక జన్మ చాలు" అని కూడా సునీత వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి, సునీత అహూజా విడాకుల వార్తలను అధికారికంగా ఖండించారు, అయితే వారి దాంపత్య జీవితంలో కష్టాలు ఉన్నాయని, గోవింద ప్రవర్తన తనకు నచ్చలేదని పలు సందర్భాలలో వెల్లడించారు. వారి మధ్య మనస్పర్థలు ఉన్నప్పటికీ, విడాకులు మాత్రం తీసుకోలేదని స్పష్టమవుతోంది.ఈ వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాలలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. గోవింద, సునీత 1987లో వివాహం చేసుకున్నారు.