Heroine Rajisha Vijayan: ఓన్లీ ఇన్ స్టా..నేను వాట్సప్ వాడను..
నేను వాట్సప్ వాడను..
Heroine Rajisha Vijayan: తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రజిషా విజయన్. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ అందాల తార. తన క్యూట్ లుక్స్, యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల మోహన్ లాల్ నటించిన మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ 'కాలంకావల్' లోనూ ఓ కీలక పాత్ర పోషించింది. సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ అండ్ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
అలాగే సోష ల్ మీడియా వినియోగం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'నేను కాలేజీ చదువు పూర్తికాగానే ఫేస్ బుక్ కు గుడ్ బై చెప్పేశా. ప్రస్తుతం కేవలం ఇన్ స్టాగ్రామ్ మాత్రమే చాలా అరుదుగా వాడుతున్న మనుషులను ప్రత్యక్షంగా కలవడం చాలా విలువైన విషయం. ఫోన్ కాల్స్ లేదా మెసేజీల కంటే ఫేస్టు ఫేస్ మాట్లాడటం ఎక్కువ అర్ధవంతంగా ఉంటుంది అని నేను భావిస్తాను. షార్ట్స్, రీల్స్ వల్ల చాలా మంది వాటికి బానిసవుతున్నారు. సమయం "ఎంత ముఖ్యమో మనం గుర్తించలే కపోతున్నం. వీటి బదులు మంచి సినిమాలు చూడవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతరు 'లతో గడపవచ్చు' అని రజిషా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ గా మారాయి.